బయట మినరల్ వాటర్ తప్ప ఇంకోటి తాగను. లోపల ఏ నీరు పడేసినా మూడు సార్లు తాగి తలకి రాసుకుంటాను
బయట లంచం తీసుకుంటాను. లోపల లంచం ఇస్తాను.
బయట ఎవర్నీ కేర్ చేయను. లోపల పంతులు కాళ్ళ మీద పడతాను.
బయట పది కూడా దానం ఇవ్వను. లోపల కిరీటాలు, బంగారు మొలతాల్లు పదిలపరుస్తాను.
బయట నాలుగు అడుగులు వేయటానికి గింజుకుంటా. లోపల మూడు కాదు ముప్పయి ప్రదక్షినాలైనా చేస్తా.
బయట ఐదు సెకన్లు కూడా వేస్ట్ చేయను. లోపల దర్శనం కోసం ఐదు గంటలైనా దైవ స్మరణ చేస్తా.
బయట “పంతులు పంతులు పావు సేరు మెంతులు” పాడుకునే నేను లోపల శటగోపం కోసం తల వంచుతా
బయట ఎవరో తరుముతునట్టు ఉరుకులు పరుగులు తీసే నేను లోపల అడుగుకి అడుగుకి మధ్య అహనా పెళ్ళంట లో బ్రహ్మి చేత “ఆచార్య దేవ ఏమంటివి…” మొత్తం చెప్పించుకుంటా.
బయట యావరేజి గా ఉన్నా పన్నెత్తి మాట్లాడే నేను లోపల సొగసరి శిల్పాలను కన్నెత్తి కూడా చూడను.
బయట మొహానికి పేస్ ప్యాక్ లోపల మనసు కి మొత్తం లాక్
బయట నేను నిజాన్ని, లోపల మేలి ముసుగుని
ముసుగు మేలిమి రకం దే కాని మేలు చేసేదేనా?
నా ముసుగే నా పేరు
ఈ మోసం నా తీరు
bhakti-man
Advertisement