“ఎహేయ్, పెట్టు ఫోన్, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని ఎన్ని సార్లు చెప్పా, ఎందుకిలా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెడతావ్” అని గట్టిగా అరిచి కాల్ కట్ చేశా. ఫోన్ జేబులో పెడదాం అని జేబులోకి చెయ్యి పెట్టేసరికి ఫోన్ అక్కడే ఉంది. ఇదంతా నా ఊహా (శ్రీకాంత్ కి నా క్షమాపణలు) అనుకుని తెలివి తెచ్చుకుని అటు ఇటు చూసా, ఇంట్లో వాళ్ళందరు సావిత్రి రింగా రింగా పాటకి డాన్సు వేస్తుంటే చూసినట్టు నా వైపే చూస్తున్నారు. “ఏం లేదు, ఏం లేదు” అంటూ చెప్పులేసుకుని బయటకి వచ్చేసా. ఎటు వెళ్ళాలో తెలీక తన దగ్గరకే బయలుదేరా, ఎవరిని ప్రేమించాలో తెలీక తనను ప్రేమించినట్టు. ఎప్పుడు తన ఇంటికి వెళ్ళని నేను ఈ రోజు ఆ పని చేయబోతున్నా, నేను చేయబోయే పని అర్ధం చేసుకున్న గుండె రెస్పాండ్ అవటం మొదలుపెట్టింది. 99 మీద అవుటైన సచిన్ ని చూసి నేను బుర్ర కొట్టుకున్నట్టు ఓ తెగ కొట్టేసుకుంటుంది. చిల్లు పడ్డ కుండ లోంచి దారి పొడుగునా నీళ్ళు కారినట్టు నా అరిచేతుల నుంచి చెమట కారుతుంది. ఇంటి దాక వచ్చేసా. తలుపు కొత్తబోయేసరికి ఒక సారి భయం ముంచుకొచ్చింది. నా ఇష్టదైవం అయిన జాంబవంతుడ్ని తలుచుకుని తలుపు కొట్టా, అది తీసే ఉండటం తో వెంటనే జరిగింది. లోపల ఎవరు లేరు. మెల్లగా అడుగులేస్తే మూడడుగుల్లో చేరే సోఫా ఆరు అడుగులు పట్టి ఆ టెన్షన్ లో ఇంకా చెమటలు పడతాయని, రెండు అంగల్లో సోఫా మీద పడ్డా. ఆ శబ్దానికి లోపల నుంచి తను, తన అమ్మ, తన పిన్ని వచ్చేసారు. ఏం మాట్లాడాలో తెలీక తానంటే నాకు ఇస్తామని చెప్పేసా.
అసలు తనకి తన అమ్మకి లేని బాధంతా తన పిన్నికి ముంచుకొచ్చి “ఏంటి బాబూ, కాలేజీ కి వెళ్ళే అమ్మాయిలని ప్రశాంతం గా చదువుకోనివ్వరా” అన్నా తానేమీ మాట్లాడలేదు. అంతే నాలో అగ్నిపర్వతం బద్దలయింది “నాలోన పొంగెను లావా, నీకింక కౌంటర్లు పేలవా” అని పాడుకుంటూ “ఎహే జీవితం, చదువుకునే అమ్మాయిని లవ్ చేస్తే కాలేజీ అమ్మాయి వెంట పడతావా అంటారు. ఇలా చదువయ్యిన వెంటనే జాబ్ వస్తుంది, జాబ్ వచ్చాక పెళ్లి చేసేస్తారు. యింక ఎప్పుడు మేము ట్రై చేసుకోవాలి?” అని ఫుల్ గా దులిపేసి బయటకి వచ్చేసా. బయటకి వచ్చి రోడ్ మీద నడుస్తున్నా, అంతే పక్క నుంచి ఓ అమ్మాయి వెళ్ళింది. పేస్ చూడాలి అనిపించి అలా తన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లి కాసుఅల్ గా తల తిప్పి చూసా, అంతే తల తిరిగిపోయింది. ఇంతా బాగుందేంటి? ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అంటే ఇదే ఏమో అనిపించింది. అలా ఆమె తో పాటు నడిచి, కొంచెం దూరం పోయాక ఆమె వైపు తిరిగి “Excuse me, can I walk with you” అని అడిగా. ఆమె నవ్వి “with pleasure” అంది. నేను “no , with feet ” అనేసరికి అయోమయం గా మొహం పెట్టింది. “ఛీ జీవితం, జోక్ ఎక్కలే” అనుకున్నా. అంతలో తనే “మీ పేరేంటి” అని అడిగింది. నేను పేరు చెప్పి “నాకు కూడా చాలా అడగాలని ఉంది, కాని మనిద్దరి వాయిస్ లలో మీ వాయిస్ ఏ బాగుంది, మీరే మాట్లాడండి” తను కిలా కిలా నవ్వేసరికి నాకు వాళ్ళంతా కితకితలు పెట్టినట్టు అయింది. తను “పేరు మధుమిత.ఇక్కడ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నా.” నేను వెంటనే మైండ్ లోకి ఆర్కుట్ ఇన్ఫోసిస్ కమ్మునిటీస్ మధుమిత అనే పేరు ని ఫీడ్ చేసేసా. అలా ఇంకొంచెం సేపు మాట్లాడుకున్నాం. తను అన్నా హజారే గురించి, లోక్పాల్ బిల్ గురించి ఆవేశం గా చెప్పుకుంటూ పోతుంది. నేను blackmailers గురించి మనకి ఎందుకు లే అని ఏం మాట్లాడలేదు. తనతో కలిసి నడుస్తుంటే మీటర్లు మిక్రోమీటేర్లలా అనిపించాయి.
ఇంకొంత దూరం వెళ్లేసరికి ఓ అబ్బాయి ఎదురుగా వచ్చాడు. అతన్ని చూడగానే మధుమిత “అజయ్ ఏంటి ఇలా వస్తున్నాడు?” అంది. “అజయ్ తన బాయ్ ఫ్రెండ్ కాకూడదు కాకూడదు” అని నేను మనసులో తెగ కోరేసుకుంటున్నా, అజయ్ మధుమిత దగ్గరకి వచ్చి “మాడం, మీరింకా రాలేదని అందరు కంగారుపడుతున్నారు” “హమ్మయ్య” అంటూ ఊపిరి పీల్చుకున్నా. అజయ్ “సర్ సినిమా టైం అయిపోతుందని కోపం గా ఉన్నారు. “ఈ సర్ ఎవడా” అనుకుంటూ ఉండగా ఓ అతను బయటకి వచ్చి “ఏంటి మధు ఇంత సేపు? సినిమా టైం అయిపోతుంది” అంటే మధుమిత “ఏం లేదు walking కి వెళ్ళానా, అక్కడ ఇద్దరు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. టైం కి ***** తోడు గా వచ్చాడు” అంది చేయి నా వైపు చూపెడుతూ. నా వైపు తిరిగి “హరీష్, my husband ” అని అతన్ని పర్సిహాయం చేసింది. అంతే కాలి కింద కార్పెట్ ని ఎవరో లాగేసిన ఫీలింగ్. వోడ్కా అనుకుని షాప్ వాడి దగ్గర coke తీసుకున్నట్టు. ఎలాగో అక్కడ నుంచి బయట పడ్డా