Archive for February, 2011

cine”maa”lo maarpulu-2

February 28, 2011

ఈ సారి తెలుగు హీరోయిన్ల గురించి రాస్తా అన్నా కదా, నేను సినిమాలు చూడటం మొదలుపెట్టేసరికి శ్రీదేవి ముప్పయ్యో పడిలోకి అడుగేత్తేసింది, టీవీ లో మాత్రం శ్రీదేవి సినిమా ఏదొచ్చినా చూసేవాడ్ని. నాకు తొంభయ్యో దశకం మొదలులో దివ్యభారతి ఆంటే చాలా ఇష్టం. అసెంబ్లీ రౌడీ లో అందమైన వెన్నెలలోన పాట లో ఇంకా నచ్చింది. సీతారామయ్య గారి మనమరాలు, అల్లరి పిల్ల సినిమాలలో మీనా కూడా నచ్చింది. తరవాత కొండపల్లి రాజ తో నగ్మా ఫ్యాన్ అయిపోయా. సౌందర్య వచ్చిన కొత్తలో పెద్ద నచ్చేది కాదు. ఇప్పటికీ కూడా ఆమె హీరోయిన్ material కాదని, సంసారపక్షమైన పాత్రలకి ఇంకో నాయిక లేక ఆమెకి అన్ని అవకాశాలు వచ్చాయని నా ప్రగాడ విశ్వాసం. బహుశా Y chromosome ప్రభావం అనుకుంటా. నటన పరం గా ఆమె చేసిన 9 నెలలు చిత్రం అద్భుతం గా ఉంటుంది. సాక్షి శివానంద్ కి కూడా నేను ఓ మోస్తరు అభిమానినే. ఆమె సముద్రం సినిమా లో చాలా బావుంటుంది. వీళ్ళందరు అప్పట్లో హీరోలు ఎక్కువ అవటం వల్ల సంవత్సరానికి చాలా సినిమాలు మూట కట్టుకునేవారే కాని glamour పరం గా మరీ అంత గొప్పగా ఏమీ ఉండరు. late ninties లో సిమ్రాన్ దెబ్బకి వీరి అవకాశాలు సన్నగిల్లాయి. హీరోలు కూడా సిమ్రాన్ తో combination repeat చేయటం మీద సుముఖం గా ఉండటం తో ఐదారేళ్ళ పాటు సిమ్రాన్ ఏలేసింది. చాలా మంది సిమ్రాన్ ని పంజాబీ అమ్మాయి గానే చూస్తారు.నేను మాత్రం కలకి, ఈ కేస్ లో అందానికి అడ్రస్ ఉండదు అంటా. దీపిక పడుకొనే కన్నడ అమ్మాయి అయ్యి బాలీవుడ్ లో అగ్ర కథానాయిక గా లేదా? పద్దతిగా కనిపించిన వాళ్ళని తెలుగు వాళ్ళ కింద జమ కట్టి, మా తెలుగు సంస్కృతి ఆహ, ఓహో అనుకోవటం మనలో కొందరు చేస్తారు. వాళ్ళ కోసం కింద సత్యాలు
1 సౌందర్య కన్నడ అమ్మాయి
2 షెర్లిన్ చోప్రా, టబు హైదరాబాద్ ఆమ్మాయిలు
సరే deviation వద్దు. సిమ్రాన్ పెద్ద హీరో లంధరితోను నటించి టాప్ హీరోయిన్ గా ఉంది. ఆ రోజుల్లో సిమ్రాన్ సినిమాలు ఏవి వదిలిపెట్టేవాడ్ని కాదు. 2000 దాటాక మహేష్, ఎన్టీయార్ , పవన్ కళ్యాణ్ లు స్పీడు పెంచారు, వారి పక్కన కొత్త భామలు వచ్చి చేరారు. అప్పటికీ 2003 లో కూడా సిమ్రాన్ కేవలం తన అందచందాలతో సీతయ్య ని సూపర్ హిట్ చేసింది. 2000 దాటాక సోనాలి బింద్రే కొన్నాళ్ళు మంచి సినిమాలు చేసింది. మురారి లో ముగ్ధ మనోహరం గా కనిపించింది. కానీ ఆమె వయసు మీధపడుతున్డటం తో అన్ని ఆఫర్ లు కుర్ర హీరోల పక్కన రాలేదు. ఈ స్టేజి లో భూమిక, శ్రియ ఇద్దరు చాలా బాగా క్లిక్ అయ్యారు. భూమిక మిస్సమ్మ లాంటి సినిమాలు కూడా చేసి అందర్ని ఆకట్టుకుంటే శ్రియ గ్లామర్ కే పరిమితం అయింది. జెనిలియా కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిపించుకోవాల్సి వచ్చింది, సుభాష్ చంద్రబోసు, అల్లుడు లాంటి చిత్రాలతో బాగా వెనకబడినా బొమ్మరిల్లు తో ఎవరికీ అందని రేంజ్ కి వెళ్లిపోయింది. బాలీవుడ్ కి మకాం మార్చేసి అడపా దడపా తెలుగు సినిమాలు చేసుకుంటుంది. దేవదాస్ తో పరిచయం అయిన ఇలియానా పోకిరి తో హిట్ కొట్టినా ఖతర్నాక్ లాంటి ఆణిముత్యం తో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది, మళ్ళీ కిక్ తో లైమ్ లైట్ లోకి వచ్చింది. వీళ్ళందరు నాకు కొంచెం కొంచెం గా నచ్చినవాల్లే, సిమ్రాన్ తరవాత ఆ స్థాయిలో నచ్చింది ఆంటే అనుష్క నే. కేవలం గ్లామర్ నే నమ్ముకుని సూపర్, అస్త్రం , మహానంది లాంటి సినిమాలు చేసి ఐరన్ లెగ్ గా ఉన్న తరుణం లో రాజమౌళి విక్రమార్కుడి తో అనుష్క దశ తిరిగింది. నాగార్జున అండదండలు కూడా ఉండటం తో అనుష్క కి తిరుగు లేకుండా పోయింది. అరుంధతి తో మిగతా వారికి అందనంత దూరం వెళ్లిపోయింది.
యింక ఈ మధ్య వచ్చిన హీరోయిన్లు హన్సిక, సమంతా, కాజల్. ఇక్కడ హన్సిక గురించి ఒకటి చెప్పాలి. హన్సిక ని కలిసిన ఓ అభిమాని తన సినిమాలు అన్నింట్లోను కోయి మిల్ గయా ఇష్టం అని చెప్పాడంట, హన్సిక మొహం మాడిపోయి అక్కడ నుంచి వెళ్లిపోయింది, సమంతా ఏ మాయ చేసావే తో చాలా మందికి నచ్చింది నాకు తప్ప. బృందావనం తో అమ్మడి నిజమైన బ్యూటీ బయటకి వచ్చేసింది. కాజల్ కళ్యాణ్ రామ్ హీరోయిన్ లంధరిలోకి పైకి వచ్చిన హీరోయిన్ అనుకుంటా, దీన్ని బట్టే తెలుస్తుంది ఆమె అదృష్టం ఏంటో.

ఆఖరి గా వీరందరు హీరోయిన్ గా నచ్చిన వాళ్ళు. మనిషి గా నచ్చిన ఒక హీరోయిన్ గురించి కూడా రాసేస్తా, ఆమె మమత మోహన్దాస్ . కాన్సర్ ని పోరాడి బయటపడింది. chemotherapy కోసం ఆమె జుట్టు మొత్తం పోతే కొత్త hairstyle కావాలన్న తన కోరిక అలా తీరింది అని చెప్పింది. ఆమె పుట్టిన రోజు న 430 మంది పేద పిల్లలకి charity flight arrange చేసింది,

సిని”మాలో” మార్పులు -1

February 16, 2011

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=12341&Categoryid=10&subcatid=34
ఇది చదివాక గతానికి నేటికి సినిమాలలో అంతర్గతం గా, బహిర్గతంగా వచ్చిన, వస్తున్న మార్పుల గురించి రాయాలనిపించింది. 80 వ దశకం లో చిత్రాల గురించి పెద్ద గా నాకు తెలీదు. నేను theater లలో సినిమాలు చూడటం 90 ల లోనే మొదలయింది . అప్పట్లో నాకు నాగార్జున ఆంటే బాగా ఇష్టం ఉండేది. కిల్లర్, ఘరానా బుల్లోడు, అల్లరి అల్లుడు, శివ, గీతాంజలి, నిర్ణయం,రక్షణ ఇలా అన్ని సినిమాలు నేను లేదా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చటం వల్ల ఆ ప్రభావం నా మీద కూడా పడింది. పాత తరం నటులలో ntr , కృష్ణ ఆంటే నాకు చాలా అభిమానం. major chandrakant ని మండపేట లో మా నానమ్మ తో కలిసి చూడటం మర్చిపోలేను. కృష్ణ నాయకుడిగా నటించిన సినిమాలలో నేను చూసిన ఏకైక సినిమా నెంబర్ వన్. చోడవరం లో ఇంట్లో గోల చేసి ఒక్కడ్ని ఆ సినిమాకి వెళ్ళిపోయా. తరవాత కృష్ణ సినిమాలు మరీ నాసిరకం గా ఉండటం తో స్వస్తి చెప్పక తప్పలేదు. తరవాత కొద్ది కాలానికి నాగార్జున అమ్మాయిల హీరో అని, అందరి ముందు నాగార్జున అభిమానిని అని చెప్పుకోటానికి కొంచెం బిడియపడి, fighting లు చేసే మాస్ హీరో లకి పంకా ని పోయాను (fan కి తెలుగు పధం పంకా). అప్పట్లో మాస్ హీరో లంటే చిరంజీవి, బాలకృష్ణ లే మరి. అలా కొన్నాళ్ళు ఈ బాల జీవి గడిపాడు. అలా చిరు అభిమానుల మధ్య అన్నయ్య సినిమా మండపేట లో చూడటం మర్చిపోలేని అనుభూతి. ఇప్పటి చిరంజీవి గురించి నేను మాట్లాడను కానీ 98 టైం లో నిజం గా మెగాస్టార్ . అందులోనూ మా తూ గో జీ లో చిరు ఫాన్స్ అత్యధికం,
అప్పుడే వెంకటేష్ ***రా చిత్రాలతో ఒక ఊపు ఊపాడు. త్యాగమూర్తి పాత్రలలో కనిపించి గుండె పిండేసాడు, ఇంకేం చేస్తాం,వెంకీ ఫాన్స్ అయిపోయాం. అలా కొన్నాళ్ళు, అప్పుడే నేను ఇంకా పెద్ద త్యాగాలు చేసేస్తా అని పవన్ కళ్యాణ్ సుస్వాగతం, తొలిప్రేమ లతో వచ్చాడు, పవన్ త్యాగాలే కాదు “నువ్వు నందా ఐతే నేను బద్రి, బద్రీనాథ్” లాంటి dialogs తో కూడా కొల్లగొట్టాడు. అప్పుడు మొదలైన అభిమానం ఇప్పటికీ అలానే చెక్కు, dd ఏవి చెదరకుండా అలానే ఉంది . జానీ , గుడుంబా శంకర్ , బాలు, జల్సా ఇవన్నీ నాకు భీకరం గా నచ్చేసాయి. నా స్నేహితులు చాలా మందికి నేను PK అభిమాని ని అని తెలీదు.
ఈ లోపు 2001 లో మురారి వచ్చింది. పిచ్చి పచ్చి గా నచ్చేసిన సినిమా అది. కనీసం యాభై సార్లు చూసుంటా . మహేష్ కి పెద్ద అభిమాని నని declare చేస్కున్న, అప్పుడే నాగార్జున తో ఎదురైన సమస్యే మహేష్ తోను ఎదురయింది, ఇంకేముంది మహేష్ looks తో హీరో ఏ తప్ప performance తో కాదు అని అభిమానం చూపించటానికి ఒక మాస్ హీరోని వెతుక్కున్నాను. అప్పుడే NTR ఆది అల్లరి రాముడు వచ్చాయి, ఇంకేముంది, సినిమాలో మొదటి నుంచి ఆఖరి వరకు అలుపెరగని పోరాటాలు, తొడ కొట్టడాలు, పెద్ద పెద్ద డైలాగులు ఇవి చాలవా, ఎవరన్నా ఏ పని అయినా చేయవద్దు ఆంటే అదే చేయటం నాకు అలవాటు. ఇంటర్ లో కాలేజీ లో ntr గొప్పా మహేష్ గొప్పా అని discussion లు అయితే నేను ఉండి తీరాల్సిందే. PK కి అప్పుడే జానీ ఫ్లాప్ కావటం తో ఎవరు పేరు ఎత్తేవారు కాదు.
అలా ఇంజనీరింగ్ కి వచ్చేసా, అక్కడ రాజేంద్రప్రసాద్ కి వీరాభిమానిగా మారా, కామెడీ ఆంటే ఆయన తర్వాతే, నవ్వుల రారాజు. అలాగే నేను చదివిన పుస్తకాల ప్రభావం వల్ల కమల్ హసన్ అన్నా విపరీతమైన అభిమానం. ఆ నాలుగేళ్ళు పూర్తయ్యేసరికి రాజేంద్రప్రసాద్, కమల్, ntr pk వీళ్ళ నలుగురికి లైఫ్ లాంగ్ పంకా గా declare చేస్కున్నా, వీరిని చూస్తే నాకు overplay చేసే నటులంటే ఇష్టం అని తెలుస్తుంది, ఒక్క కమల్ మినహా తక్కిన వారందరు అద్భుతం గా dramatize చేస్తారు. కమల్ ఏదన్నా చేయగలడనుకోండి. method acting నాకు అస్సలు పడదు, హావభావాలను, ముఖ కవళికల ద్వారా కంటస్వరం ద్వారా వ్యక్తీకరించలేని నటులు తాము జీవిస్తున్నాం అంటూ తమ లోపాలని కప్పిపుచ్చుకోవటానికే అలా చేస్తారని నాకో ముద్ర పడిపోయింది.

తరువాయి టపా లో ఇన్నేళ్ళ సినిమాలో నాకు నచ్చిన నటీమణుల గురించి (ఇప్పటి వారి నటనా పటిమ ని చూసాక భామామణులు అనటం వాస్తవం అనుకుంటా )