Archive for October, 2011

rama rama

October 12, 2011

నేను ఇటీవలే ఒక పోస్ట్ చదివాను. ఒక భక్తి పాట గురించి గొప్ప గా రాసారు. పాట ఖచ్చితం గా మంచి పాటే, కాకపోతే ఆఖరిలో ఆ పాట విన్న నాస్తికుల పాపం తగ్గుతుందని రాసారు. దానిపై నా ఆలోచనలు.
“అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ……
అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధిశోముడు ఎందువలన దేవుడు ……”
అందాలు ఉంటే దేవుడైపోతే మహేష్ బాబు, అనుష్క కూడా దేవుల్లెనా. మన దేశం లో ఎన్నో కులాలు, కులం అన్న తర్వాత దానికి ప్రభ ని తెచ్చేవాడు ఒకడుంటాడు. కాబట్టి ఒకో కులానికి ఒకో దేవుడు ఉంటాడా, ఆ దేవుడికి ఓ గుడి ఉంటుందా? పెరుగుతున్న భూమి ధరలను అందుకోలేని కులాలు ప్రభుత్వమే తమ దేవుడికి గుడి కట్టాలని ధర్నాలు చేస్తాయి.
“తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను ……
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు”
తండ్రి చెప్పింది తప్పా, ఒప్పా అని ఆలోచించనివాడు, పెద్దకొడుకు కే రాజ్యం దక్కాలన్న కనీస నీతిని మరిచిపోయి అడిగిన తండ్రి మాట మన్నించిన వాడు దేవుడా? తన తమ్ముడి కోసం తను బాధ పడితే దేవుడవుతాడా, ఎందుకు మనం త్యాగానికి, బాధకి ఇంత ప్రాముఖ్యతని ఇస్తాం? అయినా తన తమ్ముడెం బాగుపడ్డాడు? “అయ్యో మా అన్న నన్ను వదిలి వేల్లిపోయాడే” అని భోరున విలపించలేదా? లేదా తమ్ముడికి తనపై అంత ప్రేమ ఉన్నదని రాములవారు గ్రహించలేదా?
“అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను ……
అంభవించదగిన వయసు అడవి పాలు చేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేసెను
అందాల రాముడు అందువలన దేవుడు. ”
నిజమే అప్పట్లో కోర్ట్లు, విడాకులు లేవు కాబట్టి సీత తనతో చచ్చినట్టు అడవుల వెంట వస్తుందని ఊహించి ఆమెను అడవి పాలు చేసాడు. అడుగు పెట్టిన చోటల్లా అర్యభూమా, దొంగ చాటు గా చెట్టు చాటున నక్కి వాలిని చంపినపుడు చెట్టు వెనక పడిన అడుగులు ఆ చోటిని అర్యభూమి చేశాయా?
” ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ……
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మం కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేవుడు. ”
రావణుడిని చంపటం మంచి పనే, కాకపోతే ధర్మం కాపాడుతకి సతిని విడనాడేనా? ఏమిటా ధర్మం? చాకలి మాటలకి జ్ఞానోదయం అయి తెలుసుకున్న ధర్మం? అతగాడి నాన్నకి ముగ్గురు భార్యలు, అలాంటప్పుడు సీత రావనుడ్ని ఇష్టపడితే మాత్రం తప్పేంటో? మహిళలకి సమాన హక్కులు కావాలని మీరు అనుకోవటం లేదా?