Archive for March, 2011

Publicity

March 18, 2011

కాదేదీ రాతకి, రోతకి అనర్హం.పబ్లిసిటీ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ పబ్లిసిటీ కళలకి సంబంధించిన రంగాలలో ఎక్కువ గా కనిపిస్తుంది. మనం ఏం చేసాం అన్నది ముఖ్యం కాదు మనం ఏం చేసామని జనం అనుకుంటున్నారో అదే ముఖ్యం. ఉదాహరణకి వర్మ గారిని తీసుకుందాం, ఆయన తీసే చిత్రాలలో తొంబై శాతం జనానికి అర్ధం కావు, ఆయనకీ అర్ధం కావు. ఇక్కడ వంద మంది కి అర్ధం కానిది ఎవడికయినా అర్ధం అయినట్టు “వాడు చెప్పుకుంటే” చెప్పుకున్న వాడికి వాడి తెలివితేటల మీద నమ్మకం కలుగుతుంది, కాబట్టి వంద మంది లో ఒకడి కోసం ఆయన సినిమా తీస్తాడు. కాబట్టి సినిమా కి ఖర్చు వీలైనంత తక్కువ ఉండాలి, అందుకని ఆ కెమెరా, ఈ కెమెరా వాడతాడు. అదో గొప్ప విషయం అన్నట్టు దాన్ని ఆర్భాటం గా చాటుకుంటాడు. అశ్వినిదత్ లాంటి వాళ్ళు 45 కోట్లతో సినిమా తీసామంటే నేను ఆరు లక్షలో తీసా అని వర్మ చెప్పుకుంటాడు. నిజానికి దొంగల ముటా లో ఏముంది గొప్ప? ఐదు రోజుల్లో సినిమా పూర్తి చేసాడు. ఇది భారతీయ సిని చరిత్ర లోనే అపూర్వం అంటుంది మీడియా. నిజమా?
ఇంతకముందు ఎవరు తీయలేదా? ఇంతకన్నా భారీ తారాగణం తో తమిళం లో స్వయంవరం అనే చిత్రం కేవలం ఒకే ఒక రోజులో షూటింగ్ జరుపుకుంది. తెలుగు లో పెళ్ళంటే ఇదేరా పేరుతో విడుదల చేసారు. కాని వర్మ లా ఓ హడావిడి చేయలేదు, దొంగల ముటా సినిమా కి వస్తే రవితేజ ని మినహాయిస్తే తక్కిన వారందరు కెరీర్ లో క్లిష్ట పరిస్థితి లో ఉన్న వాళ్ళే. అలాంటి వారితో సినిమా తీసి కేవలం ఒక్క షో ఆడిన లాభమే అని వర్మ చెప్పటం పబ్లిసిటీ కి పనికొచ్చినా చాలా హాస్యాస్పదం గా ఉంటుంది. ఒక సినిమా కి ఇంతకన్నా గొప్పగా , cheap గా మార్కెట్ చేయలేమా అని ఆలోచిస్తే చాలా దారులు కనిపిస్తాయి.

భారీ చిత్రం అయితే ఆడియో ఫంక్షన్ అభిమానుల మధ్య నిర్వహించి హీరో హీరోయిన్లను వేదిక మీద ఉంచాలి (ఆరంజ్ లా కాకుండా, శక్తి లా). ఒక కార్పొరేట్ బ్రాండ్ తో tie up అయ్యి వాళ్ళ advertising space ని సినిమా లోగో కోసం వాడుకోవటం, ఆ బ్రాండ్ యొక్క అమ్మకాల మీద సినిమా లోగో ని ముద్రించటం (అనగనగ ఓ ధీరుడు కి సొనాటా వారి లా). రిలీజ్ కి వారం ముందే ఏ ఏ ధియేటర్ ల లోకి వస్తుందో వాటిలో పాటలను వినిపించటం, trailer లు వేయటం చేయవచ్చు. ఇది దాదాపు అందరు చేసేదే. చిన్న సినిమా కి వద్దాం, ఒక రకం గా చూసుకుంటే చిన్న సినిమా కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది, వివిధ రకాలుగా పబ్లిసిటీ చేయటానికి. టైటిల్ నుంచి ప్రతీ చిన్న అంశం తోను ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. ఉదాహరణకి అష్టా చెమ్మ, ఆవకాయి బిర్యాని, ఐతే . పెద్ద హీరోల సినిమాలకి వారి క్యారెక్టర్ లని కాని పోకిరి, దేశముదురు, పిస్తా ఇలాంటి పేర్లని మాత్రమే పెట్టగలం. కొత్త నటీనటుల్ని తీస్కోవాలనుకుంటే కార్పొరేట్ లింక్ అప్ ద్వారా టాలెంట్ సెర్చ్ లు, స్టార్ హంట్ లు మొదలు పెట్టవచ్చు. ఆల్రెడీ అందరు ఫిక్స్ అయిపోయినా సరే కేవలం టీవీ ప్రేక్షకుల కి సినిమా గురించి తెలియాలని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడ శేఖర్ కమ్ముల, మధుర శ్రీధర్ లాంటి వాళ్ళకే కార్పొరేట్ preference లభిస్తుంది. అలా చిన్న చిత్రం లో ప్రతీ అంకానికి కూడా పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు. locations విషయం లో అత్యవసరం ఐతే తప్ప ఆంధ్ర లో చేసుకోటం బెటర్, ఎందుకంటే ఒక ప్రదేశం లో షూట్ చేస్తే అక్కడ జనం లో కనీసం 10 % మందికి తెలుస్తుంది. అరకు లాంటి చోట షూట్ చేసి ఈనాడు లో తెలిసిన జర్నలిస్ట్ కి కొంత ముట్టచెప్పి విశాఖ అందాల లో ఫలానా చిత్రం shooting అని లోకల్ edition లో వేయించుకోవచ్చు. అలాగే indoor locations లో ఏదన్నా restaurant ని కాని, షాపింగ్ మాల్ ని కాని చూపించాల్సి వచ్చినప్పుడు కొంచెం మిడ్-రేంజ్ వాటిని ఎన్నుకోవటం బెటర్. సినిమా ద్వారా వాటికి పేరు వస్తుంది, అక్కడకి వెళ్ళే జనాలకి సినిమా గురించి తెలిసేలా ఒక hoarding లేదా ఆ ప్రాంగణం లో ఓ మినీ cutout పెట్టుకోవచ్చు.

షూటింగ్ అంతా అయిపోయాక సిసలైన కసరత్తు మొదలవుతుంది. పోస్టర్ డిజైన్ లో సృజనాత్మకత ఉండాలి. షూటింగ్ కి మునుపే ఈ పోస్టర్ లన్ని ఎలా ఉండాలని ఓ అవగాహన ఉండాలి, నాకు గత కొద్దేల్లలో నచ్చిన పోస్టర్లు కితకితలు, అష్టా చెమ్మా, ఆనంద్,నచ్చావులే. నెక్స్ట్ ఆడియో రిలీజ్. ఇందులో చాలా స్కోప్ ఉంటుంది ఎందుకంటే ప్రేక్షకులతో ఈ phase నుంచి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒక యువతరం చిత్రం అనుకోండి, రాష్ట్రం లో ఆరు పట్టణాలలో ఆరు కళాసాలలకి వెళ్లి ఆరు పాటలు రిలీజ్ చెయ్యచ్చు. radio మిర్చి, video అల్లం ల కన్నా ఇది మేలయిన పద్ధతి. ఇప్పుడు trailer లకొద్దాం. trailer లలో మన టార్గెట్ audience ఎవరో గుర్తించి వాళ్ళని ధియేటర్ కి రప్పిస్తే చాలు, ఉదాహరణకి ఆనంద్ సినిమా కి class audience టార్గెట్, trailers ని కూడా అలా చేసాడు. ఏమైంది ఈ వేళ యువకుల కోసం తీసిన సినిమా, త్రైలేర్ వారిని ఆకట్టుకునేలాగే ఉంటుంది. రిలీజ్ కి వారం ముందు theaters finalize అయ్యాక వాటి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల వరకు పోస్టర్లను అతికించి, పేపర్ మధ్యలో pamphlets పెట్టి, ధియేటర్ ల బయట సినిమా cutouts పెట్టచ్చు. ఎన్ని చేసినా సినిమా జనానికి ఎక్కాలి; Aggressive advertising kills a bad product faster.